Categories
WhatsApp

ఫ్యాషన్ తో పాటు హుందా తనం కూడా కనిపించాలి.

జాబ్ ఇంటర్యుకు వెళుతున్నారు సరే ముందుగా వేసుకునే దుస్తులు, నగలు, పాద రాక్షలు వంటివి ఫ్యాషన్ ట్రెండ్ ని అనుకరించే సెలెక్ట్ చేసుకోవాలని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖ్యంగా దుస్తుల రంగు తెలికైనవిగా , ఆకట్టుకునేలా వుండాలి. నలిగిపొయిన ఇస్త్రీ లేని డ్రెస్ అస్సలు వేసుకోవద్దు. షూ శుబ్రంగా వుండాలి. గోళ్ళు నీట్ గా కట్ చేసి వుండాలి. జుట్టు చక్కగా దువ్వి పిన్నులు పెట్టి గాలికి ఎగిరి ముఖం పైన పడేలాగా అస్సలు వుంచొద్దు. అలాగే కార్పోరేట్ కల్చర్ కు అనువైన దుస్తులు వేసుకుంటే మరీ బావుంటుంది. మోడరన్ దుస్తులు వేసుకునే అమ్మాయిలు, వెళ్ళే ఉద్యోగానికి సంబదించి, ఆ డ్రెస్ ఫార్మల్ గా ఉండాఅన్నది తేల్చుకుని మరీ వేసుకోవాలి.  ట్రెడిషనల్ గా కనిపించేలా లేదా సూట్ లో ఉండాలా  అన్నది తెల్చుకుని మరీ వేసుకోవాలి. మొత్తానికి ఫస్ట్ లుక్ లో మోహంలో తెలివితేటలు, నడిచే పద్దతిలో చురుకుదనం, మాటల్లో, నడతలో హుందాతనం వేసుకున్న డ్రెస్ లో అలవాటు ఆలోచన కనిపించేలా వుండాలని ఎక్స్ పర్ట్స్ చెప్పుతున్నారు.

Leave a comment