Categories
ఫాస్టెస్ట్ ఫిమేల్ సోలో సైకిలిస్ట్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంపాదించింది పూనే కు చెందిన ప్రీతి మస్కే. 13 రోజులు 18 గంటల 38 నిమిషాలకు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు సైకిల్ యాత్ర పూర్తి చేసింది. ఈ యాత్రలో ఆమె అవయవ దానం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తూ వెళ్లారు. గుజరాత్ లోని కాలేశ్వర్ నుంచి మొదలైన ఈ సైకిల్ యాత్ర ఏడూ రాష్ట్రాల నుంచి సాగి అరుణాచల్ ప్రదేశ్ కిబితు లో ముగిసింది.