Categories
ఉదయాన్నే ఒక డిటాక్స్ డ్రింక్ తో శరీరంలోని మలినాలను పోగొట్టవచ్చు. ముందురోజు రాత్రి ఒక లీటర్ నీళ్లలో కీరా ముక్కలు ఒక పది పుదీనా ఆకులు నిమ్మరసం కొన్ని అల్లం ముక్కలు వేసి పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీళ్లను తాగితే కొవ్వు కరిగిపోతుంది, మలినాలు పోతాయి అలాగే కొత్తిమీర పాలకూర నిమ్మరసం ఆపిల్ ముక్కలు ఒక మిక్సీలో వేసి జ్యూస్ లా తాగితే ఈ డ్రింక్ లో ఉండే పొటాషియం పాళ్ళు అధికంగా ఉంటాయి కనుక ఆకలి వెయ్యదు శరీరం తేలికగా ఉండేందుకు మొలకెత్తిన గింజలు ఆలివ్ ఆయిల్, కొన్ని ఆపిల్ ముక్కలు వెనిగర్ కలిపి తీసుకోవచ్చు వేసవిలో తాపం లేకుండా ఇలాంటివి ఉపయోగపడతాయి.