Categories
ఇంటి పనులు ఆఫీస్ పనులతో తొందరగా అలసట వచ్చేస్తూ ఉంటే కావలసినంత శక్తి శరీరానికి అందడం లేదన్న సంకేతం అది అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.పని గంటలు పెరగటం విరామం లేకుండా ఏదో పని ఉండటం వల్ల అలసట రావచ్చు.చక్కని పోషకాలున్న ఆహారం తీసుకుంటే శక్తి, బలం ఉంటుంది.రోజువారీ ఆహారంలో నువ్వుల లడ్డు, పల్లీల చిక్కి ఒక పండు, పాలు, పెరుగు ఉడికించిన సెనగలు చేర్చుకోవాలి.ఒక కప్పు పండ్ల రసం వల్ల కూడా శక్తి వస్తుంది.పొట్టుతో ఉన్న పప్పులు తృణధాన్యాలు పాల పదార్థాలు తీసుకుంటూ పచ్చళ్ళు వేపుళ్ళు స్వీట్లు తగ్గిస్తే వారం పది రోజుల్లోనే తేడా తెలుస్తుంది. అలసట మాయమై ఉత్సాహం వస్తుంది.