ఏనుగుల సంరక్షణ కోసం వాయిస్ ఆఫ్ ఏసియన్ ఎలిఫెంట్స్ సొసైటీ నడుపుతున్నారు సంగీత అయ్యర్ కేరళ పాలక్కాడ్ జిల్లాలోని అళత్తూరులో పుట్టి పెరిగిన సంగీత చిన్నతనంలో దేవస్థానంలో బరువైన సంకెళ్లు వేసి బంధించిన ఏనుగులను చూసి బాధపడింది. పెరిగి పెద్దయి జర్నలిస్ట్,విడియోగ్రాఫర్ అయి కెనడాలో స్థిరపడ్డారు సంగీత.కేరళలో ఉత్సవాల్లో సంకెళ్లు వేసి,చూపు మందగించిన ఏనుగులు నిలబడి ఉండటం 2013లో భారతదేశానికి వచ్చినప్పుడు చూశారు. మానవ హింస వల్ల ఏనుగులు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో ఏనుగులు ఎంత బాధ పడతాయో కళ్ళారా చూశాక దాన్ని డాక్యుమెంటరీ చేసి ప్రపంచం ముందుకు తీసుకువచ్చారు. తాజాగా సంగీత అయ్యర్ తీసిన తాజా డాక్యు సీరీస్ ఏషియన్ ఎలిఫెంట్స్ 101’ మనిషి ఏనుగులను ఎంత దయతో చూడాలో చర్చిస్తుంది. ఏనుగులు తిరగవలసిన భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళితే ఏనుగులకు ఇలాటి దుస్థితి పట్టింది అంటుంది సంగీత అయ్యర్.
Categories