మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న మలానా గ్రామం పురాతన ప్రజాస్వామ్య గ్రామం. ఇక్కడి ప్రజల రూపం భాష అలవాట్లు అన్నీ ప్రత్యేకమే. ఈ గ్రామవాసులు మేము జమదగ్ని మహర్షి వారసులం అని చెబుతారు. గంజాయి పంట పండిస్తారు. ఇది వాళ్ళ తరతరాల పంట గనుక ప్రభుత్వం కూడా పట్టించుకోదు. బయట ప్రపంచానికి దూరంగా ఉంటుందీ గ్రామం. హిమాచల్ ప్రదేశ్ లోని కుటా లోయకు ఈశాన్యంగా ఉండే పార్వతి లోయ గుండా ప్రవహిస్తుంది మలానా నది దీనికి ఒకవైపు చందేర్ ఖని మరోవైపు డియోటిబ్బా అనే పర్వతాలు ఉంటాయి. ఆ పర్వతశ్రేణుల్లో ని ఒక చదునైన ప్రదేశంలో సముద్రమట్టానికి 2652 మీటర్ల ఎత్తున ఉన్న గ్రామం మలానా జనాభా 1600 కు మించదు వారి భాష కట్టుబాట్లు ప్రత్యేకం. ఇతరులు ఎవ్వరు ఈ గ్రామంలో కి రావటం వాళ్లకి ఇష్టం ఉండదు వాళ్ళు మాట్లాడే భాష కానాషి లేదా రాక్షస భాష మాట్లాడే పదాలను బట్టి అది టిబెట్ బర్మా భాషల సముదాయం అంటారు. భాష శాస్త్రవేత్తలు అన్నిటికంటే విచిత్రం ఆ గ్రామవాసులు బయట వాళ్ళను ముట్టుకోరు. పర్యాటకులు ఏదైనా వాళ్ల ఉత్పత్తులు కొంటే ఆ డబ్బు నేరుగా తీసుకోరు ఒక చోట పెట్టాలి చిల్లర కూడా అలాగే దూరంగా పెడతారు. పర్యాటకులు వస్తారు కాని వాళ్ళను గ్రామంలో ఉండనివ్వరు అలా వచ్చి ఇలా చూసి వెళ్ళిపోవాలి గ్రామం బయట ఉండే దాబా లో చిన్న హోటల్లో ఉండాల్సిందే. పోలీస్ లు రారు గ్రామపెద్ద మాటే శాసనం ఇది అంతుపట్టని గ్రామం గానే ఉండిపోయింది. ఫోటోగ్రాఫర్ లు తప్ప వీడియో కెమెరా లు నిషేధం ఈ వూరి గురించి గ్లోబలైజేషన్ ఆఫ్ ఏ హిమాలయన్ విలేజ్ మలానా ది లాస్ట్ ఐడెంటిటీ పేరు తో ఒక డాక్యుమెంటరీ యూట్యూబ్ లో ఉంది.
Categories