Categories

చేపలు తరచూ తింటూ ఉంటే మైగ్రేయిన్ తలనొప్పి తగ్గుతుంది అంటున్నారు పరిశోధకులు. మొక్కజొన్న, సోయా ఇతరత్రా నట్స్ ఎక్కువ గా తీసుకున్నప్పుడు వాటిలో ఉండే లినోలిక్ ఆమ్లం తో మరింత పెరిగే అవకాశం ఉందని ఇటీవల తాజాగా పరిశోధనలు చెబుతున్నాయి. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఉండే చేప, పీతలు వంటి సీ ఫుడ్ తో నాడుల్లో ఎలాంటి ఇన్ ఫ్లమేషన్ కనబడలేదని గుర్తించారు. చేపలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మైగ్రేయిన్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.