Categories

ఇండియా లో ఫస్ట్ ఉమెన్ ఫైర్ ఫైటర్ హర్షిణి కన్వేకర్ నాగపూర్ కు చెందిన హర్షిణి యూనిఫాం ధరించాలనుకుంది. ఫైర్ ఇంజనీరింగ్ కోర్స్ సర్వీస్ కాలేజీలో అడ్మిషన్ లభించింది. ఆ కాలేజీలో ప్రవేశం పొందిన తొలి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. సాహసం, త్యాగం స్త్రీలకు రక్తం లోనే ఉంది అంటుంది హర్షిని. కొంతమంది తమ జీవితాలతో ఇతరులకు స్ఫూర్తి ఇవ్వగలుగుతారు. అగ్ని ప్రమాదం జరుగుతున్న చోట ప్రాణాలకు తెగించి ఇతరులను కాపాడాలంటే ఎంతో ఆత్మస్థైర్యం కావాలి. హర్షిణి ఆ పనికి పనిని కోరి ఎంచుకొని స్ఫూర్తిగా నిలుస్తోంది.