Categories
కరోనా కారణంగా పరిశుభ్రమైన బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి గతంలోలాగా ఎప్పటికప్పుడు తాజా కూరలు పండ్లు తెచ్చుకొనే అవకాశం లేదు.తెచ్చిన కూరలు పండ్లు శుభ్రంగా కడిగి విడివిడిగా ప్లాస్టిక్ కవర్లు లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే వాటి రంగు, రుచి అలాగే ఉంటాయి.అలాగే పండ్లు నుంచి వెలువడే ఇథలీన్ హార్మోన్ వల్ల కూరలు తొందరగా పాడవవు ఆహార పదార్థాలు బిస్కెట్లు, బ్రెడ్ వంటివి నిర్ణీత గడువు వరకు చెక్ చేసుకోవాలి. కూరలు పండ్లు బ్రెడ్, పాలు, పెరుగు వీటిని వివిధ అరల్లో పెట్టాలి మాంసం, చేపలు, వంటివి తాజాగా ఉండటం కోసం ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ లో ఉంచాలి.వెన్న జున్ను వంటివి తొందరగా పాడవకుండా ఫ్రిడ్జ్ పైభాగంలో పెట్టుకోవాలి.ఫ్రిడ్జ్ ను సమర్ధవంతంగా వాడుకుని కూరలు పండ్లు జాగ్రత్త చేసుకుంటే ఆహారం వృధా కాదు.