చిన్న పిల్లలకు స్నానం చేయించటం చాలా కష్టం. నీళ్ళు ముక్కులోకో ,కళ్ళల్లోకో,నోట్లోకో పోతాయని భయ పడతారు తల్లులు . ఎవరైనా పెద్దవాళ్ళ సాయం లేకుండా స్నానం చేయించటం కష్టం అనుకొంటారు. మరి అలాంటి అవకాశం లేకపోతే అప్పుడు బేబీ బాత్ షవర్ టాయ్ ని తెచ్చుకొంటే సమస్యే ఉండదు ఈ షవర్ టాయ్ ని  పాపాయి కి స్నానం చేయించే టబ్ లోనో,లేదా నీళ్ళ బకెట్ లోనో పడేసి దానికున్న బటన్ ఆన్ చేస్తే నీళ్ళు తేలిక పాటి జల్లుగా మీద పడతాయి ఆ జల్లు కు ఫోర్స్ కూడా ఉండదు. ఒళ్ళంతా నాలుగో,సబ్బు రాశాక ఈ షవర్ ఆన్ చేస్తే పిల్లలు సరదాగా నీళ్ళు పోయించుకొంటారు. పిల్లలకు గిఫ్ట్ గా ఇచ్చేందుకు కూడా బావుంటుంది.

Leave a comment