Categories
దేహంలో ఉండే రకరకాల హార్మోన్లలో మెలటోనిన్ ఒకటే నిద్ర పట్టేందుకు పీనియల్ గ్రంథిలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ హార్మోన్ దోహద పడుతుంది. నిద్ర చక్రం ప్రకారం ఈ హార్మోన్ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు ఉత్పత్తి అవుతోంది. నిద్ర పోయే సమయంలో కుత్రిమ వెలుగు ఉంటే ఈ హార్మోన్ ఉత్పత్తి ఆటంకం ఏర్పడుతోంది. ఈ మెలటోనిన్ ఉత్పత్తి దోహదం చేసేలా పరిశుభ్రమైన చక్కని ఆహారం చాలా అవసరం. ఆహారంలో మెగ్నీషియం,ఫాస్పరస్ విటమిన్లు తగినంతగా ఉండాలి. సేదదీర్చే సువాసనలు,సుగంధాలు ఉండాలి. సౌకర్యవంతమైన పడక, చల్లని గాలి, నిశ్శబ్దం,శుభ్రమైన వాతారణం నిద్రపోయేందుకు అనుకూలంగా ఉంటాయి. చక్కని సంగీతం కూడా నిద్రకు చక్కని టానిక్ వంటిదే.