అనేక వందల సంవత్సరాలుగా ఒరిస్సా లో సహజీవనం గా నిలిచింది పట్ట చిత్ర కళ పూరి జగన్నాథుడే స్ఫూర్తిగా  పురాణ గాధలను బట్టలపైన ప్రకృతి సహజమైన రంగులతో తీర్చి దిద్దుతారు కళాకారులు.సముద్రతీరంలో దొరికే కొన్ని రాళ్ళను హరికళ అని పిలుస్తారు ఆరాళ్ల పొడిని,సముద్రం లోపల దొరికే శంకు గవ్వలను కూడా బొమ్మలుకు వేసే రంగుల గా వాడతారు . విష్ణు పురాణం, దశావతారాలు భాగవత కథలు, మహాభారతం, రామాయణ ఘట్టాలు ఇలా పట్ట చిత్రాలన్నీ పురాణ కథా చిత్రాలు ఒక గుడ్డును ప్రకృతి రసాయన పూతలతో ముంచి ఆరబెట్టి బొమ్మల గీసే కాన్వాస్ గా వాడతారు దైవత్వం ఉట్టిపడే బొమ్మలు ఒకే విధమైన రంగులో అంచులతో ఈ పట్ట చిత్రాలు గొప్ప కళాఖండాలు.

Leave a comment