నీహారికా ,
మనం ఎవర్నేనా కలుసుకున్నప్పుడు ఫోన్ లో పలకరించుకున్నప్పుడు అంతా హ్యాపీ యేనా అని అడుగుతాం కదా . మనల్ని అలాగే అడుగుతారు . ఆరోగ్యంగానే కంప్యార్టబుల్ గానీ అని చెప్పినంత సులువుగా సంతోషం గురించి చెప్పేందుకు ఏవీ వుండవు. సంతోషం ఎక్కడి నుంచి రవళి. సంతోషం కావాలంటే అది వుండే వైపుకు ఓ అడుగువేయాలి . స్విమ్మింగ్ ఫూల్ లో జంప్ చేయునప్పుడు జుట్టు నీళ్లు చిందినంతగా మన చుట్టూ ప్రేముంటుంది. కానీ మనలో ప్రతికూలత ఇదంతా నిజమేనా అని అనుమానం భయం కోపం సందేహం ఇవన్నీ తొలగిస్తే ప్రేమ సంతోషం అన్నీ ఉంటాయి. అసూయ తొలగిస్తే ఆప్లేసులోకి ఇతరుల క్షేమం పట్ల ఆసక్తి కలుగుతుంది. సందేహం వదిలేస్తే ప్రపంచం మొత్తం ప్రేమ తోనే నిండివున్నట్లు ఉంటుంది. కోపం కాస్త తగ్గించుకుంటే ఎదుటి మనిషికి సర్వం ఇచ్చేద్దామనిపిస్తుంది. ఇలా మనలో వుండే ప్రతి కుల స్వభావాన్ని తీసేస్తూ వస్తే ఇంకేముంది. చిన్న గాలికి ఒక గడ్డిపూవు సౌందర్యానికి ఒక పసి పాప నవ్వుకీ ఎవరో తెలియని మనిషికి కూడా మనం చిరునవ్వుతో ఇచ్చే పలకరింపుకి ఎంతో ప్రాధాన్యత
ఇచ్చేస్తాం. మనం చూపిన రెండు చేతుల నిండా స్నేహం ప్రేమ వాత్సల్యం ఇష్టం నిండిపోయేన్ని దొరుకుతాయి. ఆ సమయంలో ఎవరైనా హ్యాపీ నా అన్నారనుకో హ్యాపీ గాక ఈ జీవితంలో ఏముంటుంది ఆఖరి నిమిషం దాక మన పెదవులు ఎదో ఒక సందర్భాన్ని ఇష్టపడుతూ నవ్వుతూనే ఉంటాయి. టెన్షన్లు స్ట్రెస్ లు అస్సలు అనారోగ్యాలు మటు మాయం అయిపోతాయి. ఏమంటావు హ్యాపీ యేనా ?