ఒక పట్టాన నాకేదీ నచ్చదు. నచ్చిందా దాన్ని వదల లేను. సహజంగా ఉండటం,నవ్వడం మాట్లడటం,అసలు మనస్ఫూర్తిగా నిజాయితీగా జీవించటం నాకెంతో ఇష్టం కోట్ల రూపాయలు వస్తాయన్న నేనుప్పుడు అబద్ధాలాడే ప్రకటనలు జోలికి వెళ్ళలేదు అంటుంది సాయి పల్లవి. సినిమ రంగంలో ఆమె ప్రత్యేకత ఆమెదే. మేకప్ లేకుండ నటించినా,బిడ్డ తల్లిగా నటించాలన్న ఆమె కే సాధ్యం అంటారు విమర్శకులు కూడా ఫోర్బ్స్ ఇండియ తాజాగా ప్రకటించిన అండర్ 30 జాబితాలో గుర్తింపు పొందింది సాయి పల్లవి. భారతీయ యువత లో ఎక్కువ విజయాలు సాధించిన వారిని గుర్తించి ఈ జాబితాలో ప్రకటిస్తారు ఎంటర్ టెయిన్ మెంట్ విభాగంలో సాయి పల్లవికి స్థానం లభించింది.