Categories
కాళిదాస్ హల్దార్ కుంకుమ్ దంపతులు పుస్తక స్త్రీలు కోల్కతాలోని లోని పాటులీ లో ఇద్దరు కలిసి ఒక పాత ఫ్రిజ్ లో పుస్తకాలు సద్ది ఒక షాప్ ముందర పెట్టేశారు. తినుబండారాలు అమ్మే షాప్ ఓనర్ ఈ ఫ్రీ ఫ్రిడ్జ్ బుక్ లైబ్రరీని సంతోషంగా వప్పుకొన్నాడు ప్రజల్లో పుస్తక పఠనం అలవాటు పెంచేందుకే ఈ ప్రయత్నం అంటున్నారు ఈ బెంగాలీ దంపతులు, పాఠకులకు ఉచితంగా ఒక పుస్తకాన్ని తీసుకొని నెల తరువాత తిరిగి ఇవ్వమని సందేశాన్ని ఫ్రిడ్జ్ పక్కనే రాశారు. అలాగే తాము చదివిన నచ్చిన పుస్తకాలను కూడా ఈ ఫ్రిడ్జ్ లైబ్రరీకి ఇవ్వచ్చు. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫ్రిజ్ లైబ్రరీ గురించి తెలుసుకుని ప్రజలు ఇలాంటి లైబ్రరీలను తాము ప్రారంభించాలనుకుంటున్నామని చెప్పారు.