Categories
వర్షంలో చేతుల్ల్లో ఉన్న బ్యాగ్ లు,సెల్ ఫోన్ కవర్లు,వ్యాలెట్ లు తడిసిపోతూ ఉంటాయి. తడి సరిగ్గా ఆరకపోతే వాసన రావడం ఫంగస్ ఏర్పడటం మాములే. వర్షంలో తడిసి ఇంటికి రాగానే లెదర్ వస్తువులను తుడిచి వాటి మధ్యలో పేపర్లు ఉంచాలి.నీడనే గాలి తగిలేలా ఉంఛాలి. నేరుగా ఎండబెట్టకూడదు. వీటి పైన బురద మరకలు పడితే పాత బ్రష్ తో రుద్ది మెత్తని బట్టతో తుడిస్తే సరిపోతుంది. ఈ లెదర్ వస్తువుల పైన కరిగిన మైనం పూత పూసి తుడిచేస్తే తేమ పోయి కొత్తవిగా కనిపిస్తాయి. లెదర్ వస్తువులు ఎప్పుడు బీరువాల్లో ఉంచేయకూడదు.అలా చేస్తే ఫంగస్ వస్తుంది.