చల్లగా ఓ గాలి తిమ్మెర. కదలక మెదలక నిలబడే కొమ్మలు కదులుతాయి. గలగల మని సన్నని సవ్వడి చేస్తయి. గాలి కమ్మని సువాసనను మోసుకొస్తుంది. కనబడని కొమ్మల్లో నుంచి మామిడి చిగుర్లు తిని కోయిల మత్తెక్కి కూస్తుంది. తటిల్లుమని విద్యుల్లతని మెరిపిస్తూ వర్షమేఘం ఉరుముతుంది. ఇన్ని అందలనిచ్చే పకృతి ఎంతో అద్భుతం.మనకిచీన బహుమతులు ఎన్నెన్ని ఒక్క లవెండర్ మొక్కను తీసుకోండి. అపువ్వులు పరిసరాల్లో ఉంటే గాలికి గంధం అద్దుకున్నట్లే. వాటిని చూస్తే జీవితం మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఈ పువ్వులు ఇంట్లో ఒక కుండిలో పెరుగుతుంటే చాలు చెడు తలంపులు చుట్టుపక్కలకు కూడా రావు. ఈసారి ఏ స్నేహితుల పుట్టినరోజుకైన ఓ లవెండర్ మొక్కను బహుమతిగా ఇవ్వోచ్చు కదా.