Categories

కోవిడ్-19 వ్యాప్తి భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటుఉన్నట్లే ఇంటి పరిసరాలు వాతావరణం పైన కూడా దృష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్. రోజంతా చక్కగా గాలి లోపలికి వచ్చేలా కిటికీలు తలుపులు తీసి పెట్టాలి.తెల్లవారుజామున చీకటి వీడిన తరువాత వచ్చే గాలి చల్లగా ఆరోగ్యంగా ఉంటుంది.ఇంట్లో పేరుకునే ఏరోజు చెత్తను ఆరోజే తొలగించాలి ఆహార పదార్ధాలు ఎప్పటికప్పుడు పడ వేయాలి.మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ ఆరోగ్యానికి శ్రీరామరక్ష అందుకే కాస్త చోటు ఉన్న అపార్ట్మెంట్ సిటీ అవుట్ లో అయినా సరే కుండీల్లో నాలుగు మొక్కలు పెంచాలి.గాలిలో విషపూరితమైన పదార్ధాలను ఇవి తొలగిస్తాయి.