Categories
మొక్కలు పెంచటం ఇష్టం,కానీ ప్రతి రోజు వాటి సంరక్షణ చేయటం మరచి పోకుండా నీళ్ళు పెట్టటం,కష్టమయిపోతోంది అనుకునే వాళ్ళకోసం ఎయిర్ ప్లాంట్స్ చక్కని ఎంపిక. ఇవి గాలిలో తేమ,పోషకాలు పీల్చుకొని బతుకుతాయి. ఈ మొక్కల పేరు తిల్లాండ్సియా,చిన్న చిన్న వేళ్ళు,చిన్న ఆకులతో నీలం,గులాబీ పసుపు రంగు పూలతో వుంటాయి. కాక్టస్ రకాలుగా కనిపించే వీటిని హ్యాంగింగ్ ప్లాంట్లుగా పెంచుతాయి . ఖాళీగా ఉండే బట్టీల్లో,లేదా తీగలు బట్టి వేలాడేదాని వీటిని పెంచుకోవచ్చు. మొక్కను తెచ్చుకొని కాసేపు నీళ్ళలో తడిపి ఉంచి,ఆనీళ్ళు బాగా ఆరిపోయాక ఎక్కడ పెట్టి పెంచాలనుకున్నామో అక్కడ పెట్టేస్తే చాలు . గాలి,వెలుతురు తగిలితే చాలు ఈ మొక్కలు చక్కగా ఎదుగుతాయి అపుడపుడు కాసిని నీళ్ళు చిలకరిస్తే చాలు