Categories
గర్భం ధరించిన తోలి నెలల్లో ఉదయం వేల వికారం తో గర్భిణీలు బాధపడతారు. ఇందుకు మందుల కంటే హామ్ రెమిడీలు మంచి ఫలితం చూపిస్తాయి. మంచం దిగి దిగాక ముందే ఒక అరటి పండు తింటే ఇందులోని బి6 వికారాన్ని ఎదుర్కోవటంలో సహకరిస్తుంది. దీని వల్ల ఉదర ఆమ్లాలు పైకి రావు. వికారం వల్ల మంచి నీళ్ళు తగబుద్ది కాకపొతే ఐస్ క్యూబ్ ఒకటి నోట్లో వేసుకుంటే నోరు తడిగా వుంది దాహం వేయదు. నీళ్ళు నెమ్మదిగా కడుపులో చేరుతాయి. తాజా పరిశోధనలు కుడా అల్లం తో చేయదగిన పదార్ధాలు ఎన్నో ఉన్నాయి. జింజర్ క్యాండీలు చప్పరిస్తే వికారం రాకుండా వుంటుంది. అల్లం మురబ్బా, ఉప్పులో నాన బెట్టిన అల్లం ముక్కలు, ఉప్పు నిమ్మరసంలో నాన బెట్టిన జీలకర్ర ఇవన్నీ మేలు చేసేవే.