థాయ్ లాండ్ లొ జరిగే థాయ్ క్రాతొంగ్ వేడుక అచ్చం తెలంగాణాలో జరిగే బంగారు బతుకమ్మ పండగలగానే ఉంటుంది . కొబ్బరి ఆకులతో అల్లిన బుట్ట పై తామర, బంతి ,చామంతి ,లావెండర్ వంటి పువ్వులతో అందంగా పేర్చిన పూల బుట్టలు తయారుచేస్తారు . వాటి పై అగరవత్తులు ,దీపాలు వెలిగించి ,పూజ చేసి దగ్గరలో ఉన్న సరస్సులో వదిలిపెడతారు . థాయ్ క్యాలెండర్ లో వచ్చే ఆఖరు నెలలోని పౌర్ణమి రోజు ఈ పండుగ జరుపుకొంటారు . ఈ ఉత్సవంలో స్త్రీ ,పురుషులు ఇద్దరు పాల్గొంటారు . కన్నుల పండుగగా ఉంటుందీ ఈ ఉత్సవం .

Leave a comment