శక్తివంతమైన నవతరం వ్యక్తిగా అత్యధిక జీతం అందుకొనే టాప్ టెన్ మహిళగా గుర్తింపు పొందారు  పద్మ శ్రీ వారియర్ . ఐ టీ  రంగంలో తిరుగులేని రాణిగా గుర్తింపు పొందిన  పద్మ శ్రీ పదహారణాల తెలుగమ్మాయి . విజయవాడలో ఇంటర్ వరకు చదివి ఢిల్లీ  ఐ ఐ టీ లో చదివేందుకు వెళ్ళిన తొలితరం ఆడపిల్లల్లో పద్మ శ్రీ ఒకరు . డ్రైవర్ అక్కర్లేని కార్ల తయారీలో ,ఆ స్వయం భోదిత వాహనాలకు అవసరమైన సాఫ్ట్ వేర్ తయారీలో ,రోడ్డు ప్రమాదాలు జరగని విదంగా కార్లను అందించే బృందానికి ఈమె నాయకత్వం వహిస్తుంది . ఫార్చూన్ మేగజైన్ ఈమె కు క్వీన్ అఫ్ ఎలక్ట్రిక్ కార్ బిజ్ అని పద్మ శ్రీ ని ప్రకటించారు .

Leave a comment