Categories
కార్ రేస్ లలో పురుషులు మాత్రమే పాల్గొంటున్న ప్రపంచంలోకి మరియన్ ఆల్ బజ్ ప్రవేశించింది ఆమె వరల్డ్ ఫస్ట్ ఫిమేల్ క్రేన్ డ్రైవర్ గా గుర్తింపు పొందింది. రేస్ పోటీ ల్లో క్రేన్ డ్రైవర్ ఓ మహిళ నియామకం. ప్రపంచ గుర్తింపు గుర్తించదగిన విషయంగా అరబ్ ట్రిబ్యూన్ ప్రకటించింది మోటార్ ఇంజన్ ల పట్ల ఆమెకున్న మక్కువ ఈ ఏడాది దిరియా ఇ-ప్రిక్స్ 2022 లో పాల్గొనేలా చేసిందని స్పష్టం చేసింది ఆల్ బజ్. 13 వ ఏటనే వాహనాలు నడపడం తో ఆసక్తి చూపింది.ప్రతి కార్ తోను, ఎగ్జిబిషన్ లేదా రేస్ ల్లో పాల్గొనేది. 2018లో అరబ్ కంట్రీస్ లో మహిళల డ్రైవింగ్ పై నిషేధం ఎత్తివేయడంతో ఈ యూత్ డ్రైవర్ కల నిజమైంది. మెకానిక్ పని నేర్చుకొని లెబనాన్ లో సైకాలజీ అండ్ మీడియా కు సంబంధించిన కోర్సులు పూర్తి చేసి మోటార్ కార్ డ్రైవింగ్ ప్రపంచంలోకి వచ్చింది ఆల్ బజ్.