కరోనా ఒక వ్యక్తికి సోకితే ఆ వ్యక్తి నుంచి సగటున మరో ముగ్గురికి వ్యాపించే అవకాశం ఉంటుంది .కనుక వ్యాప్తి ని సంక్రమణ వేగాన్ని తగ్గించాలంటే దూరాన్ని పాటించటం తప్పనిసరి అని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖా స్పష్టం చేసింది .80 శాతం కేసులు మైల్డ్ గానే ఉన్నాయి కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకకుండా ఉంటుందని చెప్పారు .కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలన్నారు .పాల ప్యాకెట్లు ఉపయోగించే ముందర వాటిని కడిగితే సరిపోతుంది .ఇళ్ళలోని పెంపుడు జంతువుల పైన పశు సంపద పైన కరోనా ప్రభావం లేదు కనుక గుడ్లు , పౌల్డ్రి ఉత్పత్తులు తినచ్చు .కరోనా వైరస్ గాలిలో 2.7 గంటల వరకే బతక గలుగు తుంది .అంచేత బాల్కనీ , టెర్రర్స్ వంటి చోట్ల కూర్చోవచ్చు .ఎండలు , ఉక్కపోత వల్ల ఈ వైరస్ వ్యాప్తి తగ్గుతుందని చెప్పటానికి ఎలాటి ఆధారాలు లేవు .

Leave a comment