Categories
పెదవులు గులాబీ రంగులో ఉండాలంటే ఈ మిశ్రమం ఉపయోగ పడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల ఎక్స్ ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్,పీ బటర్ అర టేబుల్ స్పూన్, ఒక టేబుల్ స్పూన్ గ్రేటెడ్ బీన్ వ్యాక్స్ లను కొద్దిగా వేడి చేసి పెట్టుకోవాలి. చల్లారాక అందులో పది చుక్కల విటమిన్-ఇ ఆయిల్,ఏదైనా ఎస్సెన్షియల్ ఆయిల్ పది చుక్కలు కలపాలి. ఈ మిశ్రమం పెదవులకు రాసుకొంటూ ఉంటే మృదువుగా గులాబి రంగులోకి వస్తాయి. విటమిన్ ఇ టాబ్లెట్లు కూడా పెదవుల నలుపు పొగడతాయి. ఆ టాబ్లెట్స్ మెత్తని పొడిగా చేసి అందులో నీళ్లు కలిపి లిక్విడ్ లాగా చేసి పెదవులపై రెండు సార్లు రాసుకోవాలి రోజుకు రెండు సార్లు అలోవెరా జెల్ రాసినా పెదవులు మెరుస్తాయి.