2016 లో కడియం ఫౌండేషన్ స్థాపించి స్త్రీల ఆరోగ్యం గురించి పని చేస్తున్నాం. కడియం శ్రీహరి గారి ముగ్గురు అమ్మాయిలం కలిపి రక్తహీనతతో బాధపడే వాళ్లకు పౌష్టిక ఆహారం ఇవ్వడం బయోడీగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్ లు పల్లెల్లో పంచటం నెలసరి లో వాడే పాత వస్త్రాలతో కలిగే ఇన్ఫెక్షన్ ల గురించి గ్రామీణులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వంటివి చేస్తున్నాం అంటున్నారు డాక్టర్ కడియం కావ్య నజీరుల్లా ఒక వైద్యురాలు గా వర్ధన్నపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో పనిచేస్తున్న సమయంలో గర్భిణీలు ఎదుర్కొనే రక్తహీనత సమస్య తో ప్రాణం మీదకు తెచ్చుకున్న ఎన్నో కేసులు చూశాక వాళ్లకోసం వాళ్లకు ఆరోగ్యం విషయంలో అవగాహన కల్పించేందుకు కడియం ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు  మొదలు పెట్టారు అంటున్నారు కావ్య.

Leave a comment