పురుషులకే పరిమితమైన వృత్తి లో తనదైన ప్రత్యేక ముద్ర వేసింది తమిళనాడులోని విల్లు పురానికి కి చెందిన శంకరి బంగారు ఆభరణాలు తయారీలో గొప్ప నైపుణ్యం సంపాదించింది ఈ మధ్యకాలంలో రాత్రికి రాత్రి 1000 బంగారు ఉంగరాలు పైన హ్యాండ్ కట్ డిజైన్లు తయారు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచారామె. బంగారు పనిచేసే భర్త ప్రోత్సాహం తో ఆభరణాలు తయారీ నేర్చుకొంది. 2010 నుంచి పురుషులు మాత్రమే పని చేసే బంగారు నగల వర్క్ షాప్ లో అడుగుపెట్టింది. రోజుకు 300 నుంచి 400 ఉంగరాలు కట్ చేయగలదు శంకరి. బంగారు ఉంగరాలు ముక్కు పుడకలు లాకెట్ల పైన హ్యాండ్ కట్ డిజైన్స్ ఎక్కువ గా చేస్తుంది శంకరి.