Categories
ద్రాక్ష,జీడిపప్పు వేయనిదే లడ్డుకి చక్కని రుచి రూపం రాదు. ఎన్నో స్వీట్లలో అలంకరణ కోసం వాడే ఎండు ద్రాక్షలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిలో ఐరన్ శాతం అధికం.కనుక రక్త హీనత పోగొడుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే వీటిని తీసుకుంటే రోజుకు కావల్సిన శక్తి లభిస్తుంది.ఈ ఎండు ద్రాక్షను రాత్రి వేళ నీళ్ళలో నాననిచ్చి ఆ నీటితో పాటు ఎందు ద్రాక్ష కూడా తినేస్తే మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.