Categories

మిస్ జార్ఖండ్ 2020 పోటీల్లో టైటిల్ గెలుచుకున్న సురభి పర్యావరణ హితం కోరి చేసిన ఫోటో షూట్ సామాజిక మాధ్యమాల్లో అభినందనలు అందుకుంటోంది. ఫ్యాషన్ ఫోటో గ్రాఫర్ ప్రాంజల్, జార్ఖండ్ రాజధాని రాంచీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెత్తను తరలించే డంపింగ్ యార్డ్ ఉండే ప్రాంతంలో వస్తున్న అనారోగ్యాలు, దుర్వాసన ఆ చుట్టుపక్కల వాళ్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడో ఫ్యాషన్ షూట్ తలపెట్టాడు ఇందుకోసం సురభి మోడల్ గా పని చేసింది. మురిగిపోయిన చెత్తకుప్పలు విపరీతమైన దుర్గంధాన్ని ఓర్చుకొని సురభి చేసిన సాహసం అధికారులను కదిలించింది. జార్ఖండ్ అధికార వర్గాలు ఈ చెత్తను తరలిస్తామని ప్రకటన చేశారు.