తేనె ను లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. లెక్కలేనన్ని ప్రయోజనాలు,పోషకాలు,ఔషద గుణాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాల్లో చెప్పారు. చక్కెర బదులు తేనె వాడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.అయితే ఇంత గొప్పగా అభివర్ణించిన తేనె అంత ఆరోగ్యకరం కాదంటున్నాయి కొత్త అధ్యయనాలు .చక్కెర కంటే తియ్యనిది తప్ప తేనెలో చెప్పుకోదగిన సుగుణాలు ఏవీ లేవని పోషక విలువల విషయంలో తేనె అంత అద్భుతం ఏమీ కాదంటున్నారు. తేనెలో క్యాలరీలు ఎక్కువే .అయితే ప్రయోజనంలో ఏమీ లేదు. బాక్టిరీయా నిర్మూలన విషయంలో కేవలం రెండేరెండు రకాలు తేనె కు లొంగుతాయట. తేనె తీపి కంటే జ్ఞాపక శక్తి పెరుగతుందని సహాజంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా గర్భంలో పిండానికి ప్రమాదం జరుగకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి.

Leave a comment