గోవాలోని శాలిగావ్‌లో పుట్టి పెరిగిన మలైకా వాజ్ పద్నాలుగేళ్లకే విండ్ సర్ఫింగ్ నేర్చుకుంది. తర్వాత ఫెలిస్ క్రియేషన్స్’ సంస్థలో వైల్డ్‌లైఫ్ పరిశోధకురాలిగా చేరింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్ గ్రాంట్ తీసుకొంది. ఆ గ్రాంట్‌తో ‘లివింగ్ విత్ ప్రిడేటర్స్’లో సిరీస్‌ని రూపొందించింది మలైకా. సింహాలూ, చిరుతపులులూ, పులుల్ని రక్షించే ఆదివాసీ తెగలగురించి వీటిలో చూపించింది.మూడేళ్ల కిందట బెంగళూరు కేంద్రంగా ‘అన్టేమ్డ్ప్లానెట్’ సంస్థను నిత్యే సూద్‌తో కలిసి ప్రారంభించింది మలైకా. వీరు తీసిన ‘పెంగ్ యు సై’ డాక్యుమెంటరీ ఈ ఏడాది జులైలో గ్రీన్ ఆస్కార్స్‌గా పిలిచే జాక్సన్ వైల్డ్ మీడియా అవార్డ్స్‌కి రెండు విభాగాల్లో నామినేట్ అయింది.