గ్రీన్ టీ తో మరో ప్రయోజనం ఉంటుందని కనిపెట్టారు పరిశోధకులు. ఈ టీ లోని ఇసిజీ అనే సమ్మేళనం మెదడున్ ఉత్తేజ పరిచి దాని పనితనాన్ని మెరుగుపరుస్తుందని పరిశోధన సారాంశం. అలాగే గ్రీన్ టీ లోని ఎపిగాలోకెట్ బిన్-3 గా లెట్ అనే పదార్ధం దంతాల పైన డెంటిన్ ను దెబ్బతీసి రంధ్రాలు ఏర్పడటానికి కారణం అయ్యే బాక్టీరియాతో పోరాడి దంతాలను రక్షిస్తుందిట. గ్రీన్ టీ తాగాక దీని ప్రభావం దంతాల పై 96 గంటల పాటు ఉంటుందని, దంతాల పైన బాక్టీరియాను చేరనివ్వదని తెలిసింది. ఇదే పదార్ధంలో కాప్యుసుల్ ని తయ్యారు చేసి దంతాల పై ప్రయోగించి చూశారు. దంతాల పైన ఎనామిల్ దెబ్బతిన్న వారికి గ్రీన్ టీ ఎంతగానో మేలు చేస్తుందని చెప్పుతున్నారు. రెండు మూడు కప్పులు గ్రీన్ టీ తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని రిసెర్చ్ లు చెప్పుతున్నాయి.
Categories