Categories
కాఫీ పొడిని పానీయం గానే ఇంకెన్నో విధాలుగా పనికి వస్తుంది . ఫర్నీచర్ లో పగుళ్ళను కాఫీ పొడితో సరిచేయచ్చు . కాఫీ పొడిలో రెండు చుక్కలు నీళ్ళు వేసి గట్టిగా పేస్టులాగా చేసి ఆ పగుళ్ళ పై కత్తితో సమంగా అద్దితే ఫర్నీచర్ రంగులో కలసిపోయి పగుళ్ళు కనబడవు. కారులో చెడు వాసనలు ఉంటే తాజా కాఫీ గింజల పొడిని కాసేపు కారులో ఉంచితే బేకరీ పుడ్ వాసనతో పాటు ఇతర వాసనలు కూడా పోతాయి చెట్లకు ఉపయోగించే మట్టి త్వరగా ఎరుపుగా మారాలంటే కాఫీపొడిని ఆ మట్టిలో కలపాలి గులాబీ మొక్కల పొదలకు మూడు అంగుళాల దూరంలో చుట్టూ గంట తీసి దాన్లో కాఫీపొడి వేస్తే అందులోని నైట్రోజన్ గులాబీ చెట్టుకు బలం ఇస్తుంది . మాంసాహార వంటలు సగం ఉడికాక కొద్దిగా కాఫీ డికాషన్ కలిపితే ఘుమఘుమ లాడిపోతుంది .