Categories

గులాబీ రంగులో మెరిసే రోజు గోల్డ్ ఆభరణాలు ఇవాల్టి యువతలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఈ రోజు గోల్డ్ కోసం బంగారంలో ఎక్కువ శాతం రాగి కొద్ది పరిమాణంలో వెండిని కలుపుతారు ఎంత ఎక్కువ రాగి కలిపితే బంగారం అంత ఎరుపు రంగులోకి వస్తుంది గులాబీ రంగు వచ్చేంత రాగి కలిపి అన్ని రకాల ఆభరణాలు తయారు చేస్తున్నారు. 18 క్యారెట్ల బంగారంలో 75 శాతం బంగారం, 21 శాతం రాగి,4 శాతం వెండి ఉంటుంది. రోజ్ గోల్డ్ ప్లాటినం కలిపి లేయర్డ్ జువెలరీ చేస్తున్నారు.అలాగే నగలే కాదు రోజ్ గోల్డ్ లో చేతి గడియారాలు వచ్చాయి. వేడుకల్లో ఈ గడియారం ఒక ఆభరణం లాగా కనిపిస్తుంది.