Categories
గులాబి రేకులు చర్మ సంరక్షణ చేస్తాయి. గులాభీ రేకుల్నీచల్లని నీళ్ళలో కాసేపు ఉంచి ,వాటిని మెత్తగా చేసి ఫేస్ పాక్ వేసుకొంటే ముఖం ఎంతో తాజాగా ఉంటుంది. పొడి చర్మం గల వాళ్ళకి గులాబి రేకుల్లోని సహజమైన నూనెలు కావాల్సిన తేమను ఇస్తాయి. గులాబీ రేకుల్ని మొత్తగా చేసి కాసిన పాలు తేనె కలిపి ప్యాక్ వేసుకొని ఓ అరగంట అయ్యాక కడిగేస్తే మృత కణాలు పోవటంతో పాటు ముఖచర్మం ఎంతో మృదువుగా అయిపోతుంది. గులాబీ రేకుల్లో రోజ్ వాటర్ తేనె కలిపి గుజ్జు చేసుకొని ప్యాక్ వేసుకొన్న మొటిమల సమస్య పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎండలకు చర్మం నల్లబడితే గులాబీ రేకుల్లో చందనం నిమ్మరసం పసుసు వేసిన ప్యాక్ వేసుకొంటే చర్మం మెరుస్తూ ఉంటుంది.