Categories
గులాబీ రంగులో పెదవులు మెరిసిపోవాలంటే గులాబీ రేకులే కావాలి. కొన్ని గులాబీ రేకుల్ని నీళ్ళతో కడిగి పాలలో కొన్నిగంటలు నాననివ్వాలి పాలతోనే వాటిని మెత్తగా పేస్ట్ గా చేసి పొడి పెదవులపై రాస్తూ ఉంటే పెదవులరంగు గులాబీ వర్ణంలోకి మారిపోతుంది. అలోవేరా కూడా పగిలిన పెదవులకు బాగా పనిచేస్తుంది ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందర అలోవేరా ఆకును కత్తిరించి దాని లోపలి ప్రెస్ జల్ ను పెదవులకు రాసుకోవాలి. పాలమీగడ కూడా పెదవులకు మంచి మాయిశ్చరైజర్ ప్రతి రోజు పాలమీగడ రాయవచ్చు .అలాగే బీట్ రూట్ రసం కూడా చర్మంలోని తేమను కాపాడుతుంది. బయటకు వెళ్లేముందర తాజా బీట్ రూట్ రసం పెదవులకు రాస్తే పదినిమిషాల్లో చల్లని నీళ్లతో కడిగేస్తే తాజాగా సహాజమైన ఎరుపుతో మెరుస్తాయి.