ఈ లాక్ డౌన్ లో తప్పకుండా చూడవలసిన సినిమా గులాబో సీతాబో. ఒక పురాతనమైన హవేలీ.మిర్జానవాబ్,ఫాతిమా బేగం ఈ హవేలీ యజమానులు . ఈ హవేలీ లో ఎంతో మంది అద్దెకుంటారు. ఎవ్వళ్ళూ సరిగ్గ అద్దెకట్టరు. మీర్జా నవాబ్ ఇతని కంటే 15 ఏళ్ళు పెద్దది. ఈ హవేలీ ని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి అప్పగించాలని,పురాతన భవనం కూలి పోతుందనీ నోటిస్ లెస్తారు. మీర్జా ఈ హవేలీని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నాలు చేస్తాడు. 70 ఏళ్ళు దాటినా ఈ మీర్జా నిజానికి భావన యజమాని కాదు. అది అతని భార్యది . కథ మొత్తం హవేలీ చుట్టు,అద్దెకున్న వాళ్ళ స్వార్ధం చుట్టు మీర్జా అత్యాస చుట్టు,బేగం తెలివి తేటల చుట్టు తిరుగుతొంది. చివరకు 90 దాటిన బేగం,మీర్జా ఆటకట్టించటం సినిమా లో ట్విస్ట్ వయోవృద్దులైన మీర్జా పాత్రలో అమితాబ్ నటన చూసి తీరాలి. సినిమా ప్రైమ్ లో ఉంది తప్పక చూడండి.
Categories