Categories
శిరోజాల సంరక్షణ కోసం ఎన్నో అద్భుతమైన నూనెలున్నాయి. కొన్ని రాకాల గాఢమైన తైలాలు వెంట్రుకలు వృద్ది చేస్తాయి. అయితే గుండు చేయించుకుని జోజోబా,లవెండర్, థైమ్ వంటి తైలాలు అప్లయ్ చేస్తే జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది. పెప్పర్ మెంట్ ఆయిల్ వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. కొత్త జుట్టు రావడానికి తోడ్పడుతుంది. ఇందులోని మెంథాల్ కారణంగా చర్మంలోపలి రక్తనాళలు వ్యాకోచిస్తాయి. దానితో రక్తప్రసరణ మెరుగై శిరోజాలు పెరుగుతాయి. చమేరీ రోజ్ మేరా సేజ్ వంటి ఔషధ మూలికల నూనెతో కేశసంపద పెరుగవుతుందంటున్నారు. ఈ తైలాలలో ఉన్న గాఢత కారణంగా వీటిని కొబ్బరి నూనెతో కలిపి వాడాలి.