పార్లర్ కు వెళితేనే సౌందర్యం కాపాడుకోగలం అనుకోనక్కర్లేదు. ఇంట్లోనే మెరుపులీనే చర్మం సాధ్యమవుతుంది. గోరు వెచ్చని నీరు,ఫేషియల్ క్లెన్సర్ తో మొహం,మెడ వాష్ చేసుకోవాలి. ఎదైనా ఫేషియల్ క్రీమ్ తో గాని పండ్ల గుజ్జుతో కాని మొహం మసాజ్ చేసుకోవాలి. శుభ్రమైన వస్త్రాన్ని వేడి నీళ్ళలో తడిపి మొహం మీద ప్రెస్ చేస్తే మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. యాంటీ ఎజింగ్ ప్రయోజనాలు గల సెరంతో చర్మాన్ని శుభ్రంచేయాలి. పాలల్లో బాదం నూనె, గ్లిజరిన్ కలిపి ఆ మిశ్రమంతో చేతులు,పాదాలు రబ్‌ చేసి చల్లని నీటితో కదిగేస్తే చాలు. చర్మం మృదువుగా చక్కని తేమతో మెరిసిపోతుంది. కొబ్బరి నూనెలో ముంచిన నిమ్మ చెక్కలతో పాదాలు రుద్దుకుంటే మృదువుగా అయిపోతాయి. ఇంట్లోనే శరీరం పట్ల శ్రద్ద చూపిస్తే చక్కని సౌందర్యం సొంతమవుతుంది

Leave a comment