గుస్సాడీ సెలబ్రేషన్ ఆఫ్ బియాంగ్ గాడ్ పుస్తకాన్ని రాసింది హైదరాబాద్ కు చెందిన జెన్నిఫర్ ఆల్ఫోన్స్ ప్రాచీన గిరిజన తెగకు చెందిన గోండులు జరుపుకునే నాగోబా జాతర గుస్సాడీ నృత్యం వారి ఆచార వ్యవహారాలు అన్ని రెండేళ్ల పాటు కష్టపడి, ఆ గిరిజనుల అభిమానం సంపాదించి పుస్తకం రాసింది జెన్నిఫర్. ఆదిలాబాద్ అడవుల్లో నెలల తరబడి ఉండి నాగోబా జాతర పై డాక్యుమెంటరీ తీసింది. ఈ డాక్యుమెంటరీకి మెక్సికో లో జరిగిన కోల్ ఇండీ జీనియస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మూడు అవార్డులు వచ్చాయి. నాగోబా జాతర బుక్ మంత్రి సిత్తక్క తో ఆవిష్కరించారు.

Leave a comment