జుట్టు ఊడిన కంగారుపడకండి మళ్లీ వచ్చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జుట్టు ఎందుకు ఊడుతుంది అంటే ఒత్తిడిని కలిగించే కార్టికో సైరన్ అనే హార్మోన్ జుట్టు కుదుళ్లకు చెందిన మూలకణాలను స్తబ్దుగా మారుస్తుందని చెబుతున్నారు. ఒత్తిడికి సంబంధించిన సంకేతం ముందుగా జుట్టు కుదుళ్ల చుట్టూ ఉండే చర్మ కణాలకు చేరుతుంది. అక్కడి నుంచి జుట్టు పెరుగుదలకు కారణం అయిన గ్యాస్ 6 అనే హార్మోన్ మూలకణాలు విడుదల చేయకుండా అడ్డుకుంటాయని పరిశోధకులు గుర్తించారు. దానితో జుట్టు కుదుళ్లు చుట్టూ గ్యాస్ 6 హార్మోన్ ఇంజెక్ట్ చేయగా శిరోజాలకు సంబంధించిన మూలకణాలు ఉత్తేజితమై కొత్త వెంట్రుకల్ని ఉత్పత్తి చేసినట్లు గుర్తించారు. పైగా ఒత్తిడి ఉన్నప్పటికీ ఈ హార్మోన్ ఇంజక్షన్ చేయడం వల్ల వాటి పెరుగుదలకు ఎలాంటి అడ్డంకి ఏర్పడ లేదన్నారు అలాగే ఒత్తిడికి కారణమైన హార్మోన్ ను పూర్తిగా తొలగించినప్పుడు జుట్టు ఊడిపోకుండా పెరుగుతుందని గుర్తించారు.
Categories