Categories
చిన్న వాళ్ళు ఫ్యాషన్ కోసం ,పెద్ద వాళ్ళు జుట్టు నెరిసినందుకు హెయిర్ డై వాడుతూ ఉంటారు. అమ్మాయిలు వేసుకొనే అందమైన రంగుల హెయిర్ డైలు. దాన్ని ఎంచుకొనే తీరుపైన అందం వెయ్యింతలు అవుతుంది. చర్మం రంగుకు ,కంటి రంగుకు నప్పే రంగు ఎంపిక చేసుకోవాలి. అలాగే వార్డ్ రోబ్ లో ఉండే ఎక్కువ శాతం దుస్తుల రంగుని దృష్టిలో పెట్టుకొని రంగు ఎంచుకోవచ్చు. సాధారణంగా బ్రాండ్ మార్చ కూడదు. సరైన జాగ్రత్తలు తీసుకొంటే,చేతికి గ్లౌజ్ వేసుకోని రంగు జారుగా ఉండేలా కలుపుకొని జుట్టు మొత్తం వ్యాపించేలా శ్రధ్ధగా వేసుకోగలిగితే దాన్ని ఇంటి దగ్గరే ట్రై చేయవచ్చు. జుట్టు ముడుచుకు పోకుండా పొడి బారకుండా మందే హెయిర్ స్టైలిస్టులను సంప్రదించి సరైన రంగు ఎంచుకోవాలి.