జుట్టు రాలడమనేది ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్య. అయితే వర్షాకాలంలో జుట్టు రాలడం సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఈ సీజన్లో ఎక్కువగా జుటు రాలిపోతుంటుంది. దీంతో ఎన్నో రకాల సప్లిమెంట్స్, కెమికల్ షాంపులు, రకరకాల ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. కానీ సమస్య ఇంకా తీవ్రమవుతుంది. కొన్ని లక్షణాలను బట్టి శరీరంలోని ఏ లోపం వలన జుట్టు రాలుతుంది అనేది తెలుసుకోవాలి. వర్షాకాలంలో జుట్టు ఎక్కువగా రాలిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. వాతావరణంలో ఉంటే అధిక తేమ కారణంగా జుట్టు మూలాలు ఎక్కువగా హైడ్రోజన్‌ను గ్రహిస్తాయి. ఇది జుట్టును పెళుసుగా చేస్తుంది. దీంతో జుట్టు ఎక్కుగా రాలిపోతుంది. దీంతోపాటు.. తేమ కారణంగా జుట్టులోని సహజ నూనె లక్షణాలు తొలగిపోతాయి. రోజులో 50-100 వెంట్రుకలు రాలిపోతే అది సాధారణమని వైద్యులు చెబుతున్నారు. అలాగే వర్షాకాలంలో దీని ప్రభావం మరింత పెరుగుతుంది. దీంతో ప్రతి రోజూ 200 వెంట్రుకల వరకు రాలిపోయే అవకాశం ఉంటుంది.
Categories