Categories
వాతావరణంలోని తేమ, చర్మం శిరోజాలకు మెరుపు పోయేలా చేస్తుంది.జుట్టు నిర్జీవంగా ఉంటుంది.వర్షానికి జుట్టు తడిసిన తలస్నానం చేసిన జుట్టు అలా వదిలేయకుండా పొడిగా ఆరేలాగా చేయాలి. తడి లో ఎంతో సేపు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్లు,దురదలు వస్తాయి.హెయిర్ స్ప్రే లు వాడద్దు.తల స్నానానికి ముందు గోరువెచ్చని ఆలివ్ నూనె, కొబ్బరి నూనె ఒంటికి పట్టించి ఉలవ పిండి, శెనగపిండి మిశ్రమంతో నలుగు పెట్టుకుంటే జిడ్డు ఉండదు.చర్మానికి తేమ అందుతుంది. కర్పూరం కరిగించిన కొబ్బరినూనె తో ఆరి కాళ్లు పాదాలు మర్ధన చేస్తే రక్త ప్రసరణ చక్కగా అంది పాదాలు ఆరోగ్యంగా ఉంటాయి.