ఆరోగ్యానికి సంపూర్ణాహారం లాగా శిరోజాలకు పూర్తి ఆరోగ్యాన్నిచ్చే ఒక ఆహారం కావాలి. దాన్ని ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. జుట్టుకు చల్లదనం ఇచ్చే కరివేపాకు,మందార పూలు,గోరింటాకు,కలబంద, తులసి,వేపాకు తో దీన్ని తయారు చేయవచ్చు. చుండ్రును మాయం చేయగలిగే తులసి వేపాకులను ఎండ బెట్టాలి చిన్నగ కోసిన ఉసిరికాయ ముక్కలు పెసలు,మెంతులు విడివిడిగా ఎండ బెట్టుకోవాలి విడివిడిగా అన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇందులో దోరగా వేయించిన అవిసె గింజలు పొడిని చేర్చాలి . ఈ పొడిని సీసాలో నిల్వచేసుకోవచ్చు. వారానికి రెండు సార్లు రెండు స్పూన్లు పొడిలో బియ్యం కడిగిన నీళ్లు ,నిమ్మరసం,పెరుగు గుడ్డులోని తెల్లసొన కలిపి పేస్ట్ లాగా చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.
Categories