ఇంట్లో తయారు చేసే హెయిర్ ఫ్యాక్స్ కొన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. జుట్టు గనుక పొడి భారీ ఉంటే మెత్తగా పండిన అరటి పండు గుజ్జు పట్టించి ఓ అరగంట ఆగి స్నానం చేయాలి. గుజ్జు బాగా అయ్యేలాగా మిక్సీలో బ్లెండ్ చేస్తే జుట్టు కుదుళ్ళ వరకు పట్టించేందుకు వీలవుతుంది.వారానికి ఇలా ఒక్కసారి చేసినా జుట్టు సిల్క్ లాగా అయిపోతుంది. పెరుగు,గోరింటాకు పొడి ,నిమ్మరసం,కాఫీ లేదా టీ డికాషన్ కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం ఈ మిశ్రమం తలకు పట్టించి ఓ గంట సేపు అలా వదిలేసి తల స్నానం చేసేస్తే ,ఇది జుట్టుకు బలం ఇస్తుంది. జుట్టు రాలనివ్వదు.అలాగే గోరింటాకు పొడి ,అరటి పండు గుజ్జు పుల్లటి మజ్జిగ కలిపి మెత్తగా బ్లెండ్ చేస్తే గుజ్జులా అయిపోతుంది. దీన్ని బాగా తలకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ సహాజమైన పదార్థాలతో చేసినవే కనుక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ రాదు.

Leave a comment