ఆనందం మన గుప్పట్లోనే ఉంటుంది. అది లోపల నుంచి ఉదయించేది. చేసే పనిలో ఏకాగ్రత నిలిపి దాన్ని విజయవంతంగా పూర్తి చేస్తే దొరికేది ఆనందమే ఎంతోమంది విజ్ఞాలు దీన్ని అనేక రకాలుగా నిర్వహించారు కోరికలను త్యాగం చేస్తే అక్షయమైన ఆనందం కలుగుతోంది అంటాడు సిద్ధార్థుడు.నిజాయితీగా సదాశయంతో ప్రేమించటమే కర్తవ్యం ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్య కర్మ నిర్వహిస్తే దొరికే సంతృప్తి పరమేశ్వరుడు ఇచ్చిన సంపద అంటారు జ్ఞానులు. ఒక పనిలో మనిషి చూపించే అభిరుచి అది ఎంత చిన్న పని అయినా ఆనందదాయకమే. ఆనందం కోసం గొప్ప గొప్ప ఖరీదైన వస్తువులు పోగు చేసే పని లేదు. ఆనందం వస్తువుల్లో ఉండదు. మనుష్యల్లో,ఆనందం మనసుల్లో ఉంటుంది. ఉజ్వలంగా వెలిగే  జ్యోతి వంటి ఆనందాన్ని అందుకోగలగటమే మనిషి ధర్మం.

చెబ్రోలు శ్యామసుందర్
9849524134

Leave a comment