కరోనా వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా మొదలైంది వ్యాక్సినేషన్ కు వెళ్లేప్పుడు మాస్కు తప్పని సరిగా ధరించాలి.. ఆరు అడుగుల దూరం పాటించాలి. ఇతర మందులు వేసుకునే వాళ్ళు వైద్యుల సలహా తీసుకోవాలి .ఒక డోస్ వేసుకోగానే ఇంకా పర్లేదు అనుకుని గుంపుల్లోకి గుళ్లల్లోకి వెళ్ళకూడదు, ప్రయాణాలు చేయకపోవడం మంచిది. టీకా తర్వాత కొంత ఒళ్లు నొప్పులు, జ్వరం వచ్చే అవకాశం ఉంది కనుక పోషకాహారం ముఖ్యం. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి ఇంజెక్షన్ ఇచ్చిన చోట తడిబట్టతో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి, బాగా నిద్రపోవాలి. ఏమాత్రం అసౌకర్యంగా ఉన్న డాక్టర్ ను సంప్రదించాలి. రెండు డోస్ లు పూర్తయ్యాక కూడా మాస్క్ లు పెట్టుకోవడం సామాజిక దూరం పాటించటం తప్పనిసరి వైరస్ ఎప్పటికప్పుడు మారిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి.
Categories