శరీరాన్ని ఆరోగ్యాన్ని ముడిపెట్టి వుంచే   బంగారు జలతారు లాంటిది నిద్ర. పడుకునే ముందర గ్లాసు పాలు తాగాలి. మెదడులోని ట్రెప్టోపాన్ అనే ఎమినో యాసిడ్ ను ఉపయోగించుకోవటానికి  పాలు సాయపడతాయి. ఈ యాసిడ్ తేలికపాటి నెగిటివ్ ఎఫెక్ట్ కలిగి మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ నిద్ర  మేలుకునే సైకిల్ ను నియంత్రిస్తుంది. మెలటోనిన్ స్థాయిలు సాయంత్రం వేళలో పెరగటం మొదలై ఉదయాలు తగ్గిపోతాయి. పాలలోని కాల్షియం సహజ మజిల్ రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. అలాగే భారతీయ వంటకాల్లో వాడే పవర్ ఫుల్ స్పైస్ జాజికాయ. అయితే చిన్న మోతాదులో ఈ జాజికాయ పొడిని కూడా తీసుకోవచ్చు. ఒక అరటిపండు కూడా పడుకునే మూడ్ను తింటే మజిల్ రేలక్సెంట్ గా పనిచేసి నిద్రాయిస్తుంది. క్వాలిటీ నిద్రకు అవసరమయ్యే మెగ్నీషియం ఖనిజాలు బాదం పప్పులు ఎక్కువగా ఉంటాయి. గుమ్మడి గింజల్లో మెగ్నీషియం అధికంగా వుండి  శరీరాన్ని మనసునూ ప్రశాంతంగా వుంచి  మంచి నిద్ర నిస్తాయి. టీ కాఫీ ఆల్కోహాల్ భారీ స్పైసీ ఆహారం వల్ల  నిద్ర సరిగా తేలికగా తీసుకుని కాసేపు వాకింగ్ చేసి చక్కని సంగీతం వింటూ హాయిగా నిద్ర పోవచ్చు .

Leave a comment