Categories
ఉదయాన్నే లేవగానే నాలుగు అడుగులు వేస్తేనే ఆరోగ్యం అంటోంది దిశా పటాని . చక్కని ఫిజిక్ కోసం జిమ్ లో కష్టపడను అంటోంది దిశా . మనం ఎలా కనిపిస్తున్నాము అనేకంటే ఎంతో ఆరోగ్యంగా ,సంతోషంగా ఉన్నాము అనేదే ముఖ్యం . నిత్యం వ్యాయామం సరైన అలవాట్లు కొన్నేళ్ళు సరిగ్గా ఫాలో అయితే శరీరం దానికి అలవాటు పడి ఇక పెరఫిక్ట్ గా అయిపోతుంది . జిమ్ లో కార్డియో లైట్ వెయిట్ ట్రయినింగులు చేస్తాను . దృఢమైన శరీరం,చేతులు,కాళ్ళు బలంగా ఉండాలి కదా అందుకోసం జిమ్నాస్టిక్స్ బేసిక్స్ నేర్చుకొంటున్నాను . కిక్ బాక్సింగ్,డాన్స్చేస్తాను . నాట్యం చేస్తుంటే మనసు పరవశిస్తుంది . మనసు ప్రశాంతంగా ఉండేందుకు అరగంటైనా యోగ చేస్తాను . మంచి ఫిజిక్ కోసమే కాకుండా,ఆరోగ్యం కోసం కూడా జిమ్ కి వెళతానంటోంది దిశా పటాని .